Sunday 8th September 2024
12:07:03 PM
Home > సినిమా > న్యాచురల్‌ స్టార్ నానిహీరోగా న‌టించిన తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’

న్యాచురల్‌ స్టార్ నానిహీరోగా న‌టించిన తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’

Natural star Nanihero's latest film 'Hi Nanna'

టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నానిహీరోగా న‌టించిన తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’ . నాని 30 గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ సినిమా సోష‌ల్ మీడియా రివ్యూలు చూసుకుంటే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అని తెలుస్తుంది.
క‌థ‌లోకి వెళితే.. ముంబైకి చెందిన విరాజ్‌(నాని) ఓ ఫ్యాషన్‌ ఫోటోగ్రాఫర్‌. తన కూతురు మహి(బేబీ కియారా ఖన్నా) అంటే విరాజ్‌కు ప్రాణం. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడతున్న మహికి అన్నీ తానై చూసుకుంటాడు. అయితే ప్రతి రోజు రాత్రి కూతురికి సరదాగా కథలు చెప్పడం విరాజ్‌కి అలావాటు. ఆ కథల్లోని హీరో పాత్రని నాన్నతో పోల్చుకోవడం మహికి అలవాటు. ఓ సారి అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. నువ్వు క్లాస్ ఫ‌స్ట్ వ‌స్తే చెబుతానంటాడు. అమ్మ క‌థ కోసం క‌ష్ట‌ప‌డి చ‌దివి క్లాస్ ఫ‌స్ట్ వ‌స్తుంది. అయినా మ‌హికి త‌న అమ్మ క‌థని చెప్ప‌డు విరాజ్‌. అయితే మ‌హీకి అమ్మ గురించి చెప్ప‌డానికి విరాజ్ ఎందుకు ఆలోచిస్తుంటాడు. అసలు విరాజ్ భార్య ఎవరు, ఆమె ఎందుకు విరాజ్‌ను వదిలేసి వెళ్ళిపోయింది ?, విరాజ్ జీవితంలోకి యశ్న (మృణాల్‌ ఠాకూర్) ఎలా వస్తోంది ? అనేది తెలియాలంటే హాయ్‌ నాన్న మూవీ చూడాల్సిందే.

ఇక ఈ సినిమా చూసిన నెటిజ‌న్లు హాయ్‌ నాన్న ఒక‌ ఎమోషనల్ రైడ్ అని చెబుతున్నారు. ముఖ్యంగా క‌థ‌లోని భావోద్వేగాలు, మ‌లుపులు, నాని, మృణాల్‌, బేబి కియారా న‌ట‌న, సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయ‌ని చెబుతున్నారు. అయితే సినిమాలో కొన్ని సీక్వెన్సె స్లోగా సాగడం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయ‌ని తెలిపారు. ఓవరాల్ గా ఈ ‘హాయ్ నాన్న’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను చాలా బాగా మెప్పిస్తోందని అంటున్నారు.

You may also like
TGSPDCL FIELD WORKERS
జోరు వర్షంలోనూ మరమ్మతులు.. విద్యుత్ కార్మికుల సాహసం!
తెలుగురాష్ట్రాల్లో వరదలు..చిరంజీవి మనవి
Sanjay Roy
కోల్ కత్తా ట్రైనీ డాక్టర్ కేసు..జైల్లో ఎగ్ కర్రీ కావాలని నిందితుడి గొడవ!
PM Modi
ఆ ఘటనపై బహిరంగ క్షమాపణ చెప్పిన ప్రధాని మోదీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions