Tuesday 29th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > నూజివీడు IIITలో 800మందికి అస్వస్థత..స్పందించిన మంత్రి లోకేష్

నూజివీడు IIITలో 800మందికి అస్వస్థత..స్పందించిన మంత్రి లోకేష్

Nuzvid IIIT Students News | ఏలూరు ( Eluru ) జిల్లా నూజివీడు ( Nuzvid )లోని IIITలో గత మూడురోజుల్లో ఏకంగా 800మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

ఒక్క మంగళవారం నాడే 342 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో విద్యార్థులు బాధపడుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కమిటీ వేసినట్లు ఐఐఐటీ పరిపాలనాధికారుల తెలిపారు.

ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) స్పందించారు. ” నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత 3 రోజులుగా విద్యార్థులు పెద్దఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్న వార్త నన్ను ఆందోళనకు గురిచేసింది. దీనిపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను అదేశించాను. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. ఇటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది. ” అని మంత్రి స్పష్టం చేశారు.

You may also like
‘ఆదర్శ ఘటన..తల్లీ నీకు వందనం’
‘పప్పూ నిద్ర వదులు’..జగన్ విమర్శలు
‘కీలక ఒప్పందం..మూడేళ్ళలో 4 లక్షల మందికి శిక్షణ’
‘గోవింద’ బెట్టింగ్ యాప్..నా అన్వేషణ వీడియోపై మంత్రి లోకేశ్ స్పందన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions