Saturday 7th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > అల్లు అర్జున్ మాట్లాడితే కౌంటర్ ఇస్తా

అల్లు అర్జున్ మాట్లాడితే కౌంటర్ ఇస్తా

Bolisetty Srinivas On Allu Arjun | ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Pre Release Event ) సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon Star Allu Arjun ) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

అల్లు అర్జున్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా ( Social Media ) వేదికగా మెగా ఫ్యాన్స్ ( Mega Fans ) మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే బిలిశెట్టి శ్రీనివాస్ ( Bolisetty Srinivas ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు అల్లు అర్జున్ కు అభిమానులు ఉన్న విషయం తనకు తెలీదని, ఆయనకు ఉన్నవారంతా మెగా అభిమానులే నని చెప్పారు. అల్లు అర్జున్ ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు.

అంతేకాకుండా గతంలో అల్లు అర్వింద్ ( Allu Arvind ) ఎంపీగా పోటీచేస్తే గెలిపించుకోలేదని విమర్శించారు. అల్లు అర్జున్ కి, జనసేన పార్టీ ( Janasena Party )కి ఎటువంటి శత్రుత్వం లేదని, కానీ అతను మళ్ళీ మాట్లాడితే తాను కచ్చితంగా కౌంటర్ ఇస్తానని బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు.

You may also like
పొత్తు ఉంటే వైసీపీ..లేకుంటే బీజేపీ లోకి: ముద్రగడ ఆలోచన
తిరుపతి నుండి నిహారిక పోటీ.. వరుణ్ తేజ్ క్లారిటీ
pawan kalyan
ముగ్గురు కూతుర్లు వాలంటీర్స్..ప్రభుత్వంపై పవన్ ఫైర్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions