Sarvapindi In Mythri Theatres | తెలుగు చిత్రసీమలో ప్రముఖ నిర్మాణ మరియు పంపిణీ సంస్థగా పేరుగాంచిన ‘మైత్రీ’ (Mythri Movie Makers) తమ థియేటర్ల ద్వారా ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వెండితెర సినిమా అనుభూతికి తెలంగాణ సంస్కృతిని, అచ్చమైన పల్లె రుచులను జోడిస్తూ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ థియేటర్ కాంప్లెక్స్ లలో తెలంగాణ సంప్రదాయ వంటకమైన కమ్మని ‘సర్వపిండి’ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
సినిమా చూస్తూనే తెలంగాణ ప్రత్యేక ఆహార సంస్కృతిని రుచి చూసే ఈ కొత్త అనుభవం సినీ ప్రియులను, ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తొలి దశలో మైత్రీ విమల్ & శివగంగ..
మొదటి విడతగా హైదరాబాద్‌లోని మైత్రీ విమల్, మైత్రీ శివగంగ థియేటర్లలో ఈ సర్వపిండి కౌంటర్లను ప్రారంభిస్తున్నారు. త్వరలో గ్రాండ్‌గా విడుదల కానున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రదర్శన సమయం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రేక్షకులు ఇంటర్వెల్ బ్రేక్‌లో ఈ కమ్మని సర్వపిండిని ఆస్వాదించవచ్చు.







