Wednesday 23rd September 2026
12:07:03 PM
Home > తాజా > రిమ్స్ లో చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలే!

రిమ్స్ లో చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలే!

Kavitha Visits Adilabad RIMS ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) ఆసుపత్రిలోని ఎస్ఎన్ సీయూ (SNCU) విభాగంలో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు పసికందులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌ను నేరుగా సందర్శించి బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

రోజులు నిండకుండానే ఐదుగురు చిన్నారులు చనిపోవడం ప్రకృతి ప్రకోపమో లేదా ప్రమాదమో కాదని, ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన “ప్రభుత్వ హత్యలే” అని ఆమె ఆరోపించారు.

దత్తత జిల్లాపై సీఎం నిర్లక్ష్యం..

ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నానని చెప్పిన ముఖ్యమంత్రికి ఐదుగురు చిన్నారులు చనిపోతే వచ్చి చూసే తీరిక లేదా అని ప్రశ్నించారు. ఫుట్ బాల్ ఆడటానికి, విదేశాలు తిరగడానికి సమయం ఉండే సీఎంకు మైనార్టీ, ఆదివాసీ పిల్లల మరణాలను పరామర్శించే సమయం లేదా అని నిలదీశారు. ఆరోగ్య శాఖ మంత్రి కనీసం గంటన్నర కూడా ఆసుపత్రిలో లేరని, కలెక్టర్‌తో సమీక్ష చేయకుండా ఎక్స్‌కర్షన్‌కు వచ్చినట్లు వచ్చి వెళ్లారని విమర్శించారు.

రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా డిమాండ్..

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం చేసిన తప్పునకు ఫైన్ కింద ప్రతి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రిమ్స్‌లో 150 మంది వైద్యులకు సగం మందే ఉన్నారని, 20 శాతం శానిటేషన్ సిబ్బంది మాత్రమే ఉన్నారని తెలిపారు. 150 ఏసీలు ఉంటే ఒక్క మెకానిక్ కూడా లేడని, ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రికి రావాల్సిన రూ. 500 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.

ఆదిలాబాద్ ఘెరావ్ హెచ్చరిక…

నెల రోజుల్లోగా ఆసుపత్రి పెండింగ్ బిల్లులు చెల్లించి, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయకపోతే ఆదివాసీలతో కలిసి ఆదిలాబాద్‌ను ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. పార్టీ అధ్యయన కమిటీ ప్రకటన: ఆదిలాబాద్ జిల్లాలో గర్భిణులు, శిశువుల మరణాలపై అధ్యయనం చేసేందుకు తమ పార్టీ తరఫున ఒక ప్రత్యేక కమిటీని వేస్తున్నామని, ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘ఫోరెన్సిక్ ఆడిట్’ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

You may also like
ఆయన వన్ టైం వండర్.. సీఎం రేవంత్ పై సంజయ్ బారు కీలక వ్యాఖ్యలు!
TG స్పీకర్ సంచలన నిర్ణయం.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరూ సస్పెండ్!
1000 రోజుల కాంగ్రెస్ పాలన.. కల్వకుంట్ల కవిత విమర్శలు!
cm revanth reddy speech
‘ప్రజా ప్రస్థానానికి 1000 రోజులు’.. సీఎం రేవంత్ ఎమోషనల్ పోస్ట్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions