Saturday 7th November 2026
12:07:03 PM
Home > తాజా > టాలీవుడ్‌లో మరో పెళ్లి బాజా.. కావ్య – కాలభైరవ నిశ్చితార్థం!

టాలీవుడ్‌లో మరో పెళ్లి బాజా.. కావ్య – కాలభైరవ నిశ్చితార్థం!

Kaala Bhairava Kavya Kalyanram Engagement టాలీవుడ్‌లో శుభకార్యాల సందడి కొనసాగుతోంది. ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆయన పెద్ద కుమారుడు, ప్రముఖ యువ గాయకుడు, సంగీత దర్శకుడు కాలభైరవ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ‘మాసూద’, ‘బలగం’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్య కళ్యాణ్‌రామ్‌తో ఆయన నిశ్చితార్థం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది.

రాజమౌళి దంపతుల ఆశీస్సులు..

హైదరాబాద్‌లో నిరాడంబరంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకకు నూతన వధూవరుల కుటుంబసభ్యులతో పాటు టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి హాజరై కాలభైరవ-కావ్యలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో కాలభైరవ, కావ్యల జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తండ్రి కీరవాణి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’తో పాటు పలు ప్రజాదరణ పొందిన పాటలతో గాయకుడిగా, ‘కార్తికేయ-2’, ‘మథుర వడగళ్’ వంటి చిత్రాలతో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

బాలనటిగా (‘గంగోత్రి’, ‘ఠాగూర్’ మొదలైన చిత్రాలలో) ఆకట్టుకున్న కావ్య.. హీరోయిన్‌గా మారి ‘మసూద’, ‘బలగం’ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ‘బలగం’ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది.

డిసెంబర్‌లో గ్రాండ్ వెడ్డింగ్..

ఇరు కుటుంబాల సమక్షంలో వేడుకగా జరిగిన ఈ నిశ్చితార్థం అనంతరం డిసెంబర్ నెలలో వివాహం జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే పెళ్లి తేదీ, వేదిక వంటి పూర్తి వివరాలను కీరవాణి కుటుంబం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

You may also like
మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు: మంత్రి పొంగులేటి పిలుపు!
రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌లో యాక్సిడెంట్!
అభిమానం హద్దులు దాటితే.. హీరోయిన్ తాగిన వాటర్ బాటిల్ రూ. 3 లక్షలకు అమ్మకానికి!
tg high court
సరా సెలవుల్లో ఆస్తులపై ఎలాంటి చర్యలు వద్దు: హైకోర్టు కీలక ఆదేశాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions