Ramayana Part 1 Review:
చిత్రం: రామాయణ పార్ట్ 1 (Ramayana Part 1)
తారాగణం: రణ్‌బీర్ కపూర్ (రాముడు), యశ్ (రావణుడు), సాయిపల్లవి (సీత), రవి దూబే (లక్ష్మణుడు), రకుల్ ప్రీత్ సింగ్ (శూర్పణఖ), లారా దత్తా (కైకేయి), శోభన తదితరులు.
దర్శకత్వం: నితీష్ తివారీ
నిర్మాత: నమిత్ మల్హోత్రా (DNEG)
సంగీతం: ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ (BGM)
కథానైపథ్యం:
రామాయణం గురించి మళ్లీ ఈ ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రామాయణంపై అనేక భాషల్లో చిత్రాలు రూపొందాయి. అయినప్పటికీ రామాయణం ఎప్పటికీ ఓ అందమైన దృశ్యకావ్యమే. ఈ రామాయణం గురించి చెబితే.. బ్రహ్మదేవుడి నుంచి అమితమైన వరాలు పొంది దేవతలు సైతం జయించలేనంతగా లంకేశ్వరుడిగా రావణాసురుడు (యశ్) మారుతాడు. ఆ రావణ సంహారం కోసం, ధర్మ రక్షణ కోసం శ్రీమహావిష్ణువు మానవరూపంలో శ్రీరాముడిగా (రణ్‌బీర్ కపూర్) అవతరిస్తాడు. తదనంతరం స్వయంవరంలో శివ ధనస్సు విరిచి సీతాదేవిని (సాయిపల్లవి) వివాహమాడిన రాముడు, కైకేయి వరాల కారణంగా రాజ్యాన్ని వదిలి 14 ఏళ్ల వనవాసానికి బయలుదేరుతాడు.
వనవాసంలో ఉన్న సమయంలో రావణుడి సోదరి శూర్పణఖ రాముడిపై మోజుపడటం, కాదన్నందుకు సీతపైకి దాడికి దిగడంతో లక్ష్మణుడు ఆమె ముక్కు కోయడం జరుగుతుంది. దానికి ప్రతీకారంగా రావణాసురుడు సీతాదేవిని అపహరించడంతో మొదటి భాగం ముగుస్తుంది. లంకను తుత్తునియలు చేసి సీతను తెస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేయడంతో పార్ట్-1కు ఎండ్ కార్డ్ పడుతుంది.
నటీనటుల ప్రదర్శన..
రణ్‌బీర్ కపూర్ (శ్రీరాముడు): మర్యాద పురుషోత్తముడిగా రణ్‌బీర్ ప్రశాంతమైన, గాంభీర్యంతో కూడిన నటనను కనబరిచారు. రాముడి పాత్రకు కావలసిన ఆధ్యాత్మిక భావనను, ప్రశాంతతను ఆయన చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారు. పరశురాముడిగా కూడా రణ్‌బీరే కనిపించడం విశేషం.
యశ్ (రావణాసురుడు): ఈ సినిమాకు ప్రధాన బలం యశ్. నిజానికి పార్ట్-1 పూర్తిగా రావణుడి కథ చుట్టూనే తిరుగుతుంది. కేవలం ప్రతినాయకుడిగానే కాకుండా సంగీత ప్రియుడైన దశాననుడి నుంచి అసుర చక్రవర్తిగా మారే క్రమంలో విభిన్న గెటప్పుల్లో యశ్ రౌద్రం, గంభీరమైన నటనతో స్క్రీన్ పై పూనకాలు తెప్పించారు. దాదాపు గంట సమయం ఆయన పాత్రకే కేటాయించారు.
సాయిపల్లవి (సీత): ప్రారంభంలో రాజకుమారిగా అంతగా ఒదిగిపోలేదనిపించినా.. కథ వనవాసానికి చేరుకున్న కొద్దీ సీతగా ఆమె నటన, భావోద్వేగాలు అలరిస్తాయి.
ఇతర నటులు: లక్ష్మణుడిగా రవి దూబే, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, రావణుడి తల్లిగా శోభన తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం (Technical Aspects)..
విజువల్ ఎఫెక్ట్స్ (VFX): హాలీవుడ్ సంస్థ ‘DNEG’ అందించిన VFX ఈ సినిమాకు మెయిన్ హైలైట్. రావణుడి లంకా నగరం, అడవి దృశ్యాలు, జటాయువు-రావణుడి పోరాట ఘట్టాలు హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా అత్యంత ఘనంగా ఉన్నాయి. 3D ఎక్స్పీరియన్స్ కూడా అద్భుతంగా పనిచేసింది.
నేపథ్య సంగీతం & పాటలు: ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే, హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సన్నివేశాలకు మంచి తీవ్రతను ఇచ్చింది.
తెలుగు డబ్బింగ్ & AI లిప్ సింక్: తెలుగు డబ్బింగ్ సంభాషణలు చాలా బాగున్నాయి. ఏఐ (AI) సాంకేతికతను ఉపయోగించి చేసిన తెలుగు లిప్-సింక్ ప్రేక్షకులకు ఒరిజినల్ తెలుగు సినిమా చూస్తున్న అనుభవాన్ని ఇస్తుంది.
చివరగా..
‘రామాయణ పార్ట్ 1’ అనేది మన పురాణేతిహాసానికి ఆధునిక సాంకేతికతను జోడించి తీర్చిదిద్దిన ఒక గొప్ప విజువల్ వండర్! అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ.. నితీష్ తివారీ కథనాన్ని ప్రారంభించిన తీరు, యాష్ రావణుడిగా చూపించిన విశ్వరూపం, DNEG అందించిన విజువల్ విందు ప్రేక్షకుడిని మైమరిపిస్తాయి. కొన్ని నెమ్మదిగా సాగే సన్నివేశాలు, బలహీనమైన సంగీతం పక్కన పెడితే.. బిగ్ స్క్రీన్‌పై తప్పక చూడాల్సిన ఒక గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్!







