Wednesday 20th May 2026
12:07:03 PM
Home > ఆరోగ్యం > తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మెడికల్ షాపుల బంద్!

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మెడికల్ షాపుల బంద్!

medical shops bundh alert

అత్యవసర మందుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..
హెల్ప్‌ లైన్ నంబర్లివే!

Medical shops Bandh Alert | ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) మే 20వ తేదీ  బుధవారం దేశవ్యాప్తంగా ఒక రోజు మెడికల్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణలో రోగులకు, సాధారణ ప్రజలకు అత్యవసర మందుల కొరత రాకుండా ఉండేందుకు రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) రంగంలోకి దిగింది. బంద్ ప్రభావం ప్రజలపై పడకుండా రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేసింది.

ఈ ఫార్మసీలు తెరిచే ఉంటాయి..
AIOCD తెలంగాణ విభాగంతో జరిపిన చర్చల అనంతరం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. బంద్ జరిగినప్పటికీ కొన్ని మెడికల్ స్టోర్స్ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.  ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే అన్ని మెడికల్ షాపులు (Hospital-attached pharmacies) రేపు యథావిధిగా తెరిచే ఉంటాయి.

అపోలో (Apollo), మెడ్‌ప్లస్ (Medplus) వంటి ప్రముఖ కార్పొరేట్ ఫార్మసీ సంస్థలు తమ అన్ని అవుట్‌లెట్లను రేపు ఓపెన్ ఉంచాలని డీసీఏ ఆదేశించింది. ప్రతి జిల్లాలోని AIOCD ప్రతినిధులు స్థానిక డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ.. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక స్టోర్స్ ద్వారా మందులు అందేలా చూస్తారు.

ఏదైనా సమస్య ఉంటే..
మందుల లభ్యతపై ఎలాంటి ఫిర్యాదులు లేదా అత్యవసర సాయం కావాలన్నా తక్షణమే స్పందించేలా క్షేత్రస్థాయి అధికారులందరినీ డీసీఏ అప్రమత్తం చేసింది. ప్రజల సౌకర్యార్థం హెల్ప్‌ లైన్ నంబర్లను విడుదల చేసింది:

టోల్-ఫ్రీ హెల్ప్‌ లైన్ నంబర్: 1800 599 6969

ప్రజలు తమ స్థానిక డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్‌ను నేరుగా సంప్రదించవచ్చు. వారి ఫోన్ నంబర్లు, కాంటాక్ట్ వివరాలు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారిక వెబ్‌సైట్‌లోని “Key Contacts” విభాగంలో అందుబాటులో ఉంచారు.

You may also like
tg organics app
‘TG organics’: ఇక నేరుగా రైతు దగ్గరే కొనొచ్చు!
Election commission
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు.. పెళ్లికి రూ. 25 వేలు!
Liquor Policy
మద్యం వినియోగంలో తెలంగాణ టాప్..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions