Tuesday 22nd September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమెరికా రాజకీయంలో ‘హనుమాన్ విగ్రహం’ చుట్టూ వివాదం!

అమెరికా రాజకీయంలో ‘హనుమాన్ విగ్రహం’ చుట్టూ వివాదం!

carlos turcios comments on hanuman statue
  • విగ్రహాన్ని కూల్చివేస్తామంటూ యూట్యూబర్ వ్యాఖ్యలు, తీవ్రంగా స్పందించిన ఇండో-అమెరికన్లు!

Texas Lord Hanuman Statue Controversy అమెరికా మిడ్‌టెర్మ్ (మధ్యంతర) ఎన్నికల వేళ ఆ దేశ రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు, ముఖ్యంగా హిందూ సమాజం ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.

టెక్సాస్ రాష్ట్రంలోని షుగర్‌ల్యాండ్‌లో ఉన్న అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన 90 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని (‘స్టాచ్యూ ఆఫ్ యూనియన్’) తొలగించాలని ఒక కన్జర్వేటివ్ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

2024 ఆగస్టులో ఆవిష్కరించిన ఈ విగ్రహంపై రైట్-వింగ్ గ్రూపులు, కన్జర్వేటివ్ ప్రతినిధులు అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానిపై ఇండో-అమెరికన్ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

వివాదం ఎలా మొదలైంది?

మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (MAGA) మద్దతుదారుడు, యూట్యూబర్ జెస్సీ హ్యూస్ ఈ 90 అడుగుల హనుమాన్ విగ్రహం ఫోటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (X) లో షేర్ చేస్తూ.. “మేము గెలిచాక, దీనిని కూల్చివేస్తాం” అని వివాదాస్పద పోస్ట్ చేశాడు.

హ్యూస్ వ్యాఖ్యలపై అమెరికా ఆర్మీ వెటరన్ రుచిర్ బక్షి తీవ్రంగా స్పందించారు. ఇతరుల ఆరాధనా స్థలాలపై ద్వేషంతో దాడి చేయడం దేశభక్తి కాదని, ఇది హిందూమతంపై నేరుగా జరుగుతున్న దాడి అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు ‘కోలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా’ (CoHNA) తో పాటు టెక్సాస్‌కు చెందిన ఆర్మీ వెటరన్ కార్ల్ వీలెస్ మద్దతు తెలిపారు.

సౌత్ ఏషియన్ విద్యార్థులపై జాతివివక్ష వ్యాఖ్యలు..

మరోవైపు టెక్సాస్ రైల్‌రోడ్ కమిషనర్ రిపబ్లికన్ అభ్యర్థి బో ఫ్రెంచ్ కూడా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ (UT) విద్యార్థుల ఫోటోను షేర్ చేస్తూ జాతివివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఏషియన్ మూలాలున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను రిపబ్లికన్ సెనేటర్ జాన్ కార్నిన్, డెమోక్రటిక్ నేత హకీమ్ జెఫ్రీస్ తీవ్రంగా ఖండించారు.

టెక్సాస్‌లో వలసదారుల రాజకీయాలు..

1994 నుంచి రిపబ్లికన్ల కోటగా ఉన్న టెక్సాస్‌లో సుమారు 5 లక్షల మందికి పైగా భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వలసదారులు, మైనారిటీల విశ్వాసాలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర నిరసనలకు దారితీస్తోంది.

You may also like
h1b visa process
హెచ్-1బీ వీసాదారులకు ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్!
student visa
అమెరికా వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్!
అమెరికా మరో షాక్.. OPT వీసాపై $1 లక్ష ఫీజు ప్రతిపాదన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions