Record prize money revealed for WTC Final | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది.
ఈ ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుంచి 15, వరకు లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఈ సారి ప్రైజ్ మనీని గత రెండు ఎడిషన్‌లతో పోలిస్తే రెట్టింపు చేసిన ICC, టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే తమ లక్ష్యాన్ని స్పష్టం చేసింది.
2023-25 WTC ఫైనల్ కోసం మొత్తం ప్రైజ్ మనీ $5.76 మిలియన్ డాలర్లు సుమారు రూ. 49.32 కోట్లుగా ఐసీసీ ప్రకటించింది. ఇది గత రెండు ఎడిషన్‌లలో 2019-21 మరియు 2021-23 ఉన్న $3.8 మిలియన్ డాలర్లతో పోలిస్తే గణనీయంగా పెరిగింది.
ఫైనల్‌లో విజయం సాధించిన జట్టు $3.6 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 30.78 కోట్ల పొందుతుంది. ఇది 2021 మరియు 2023 ఎడిషన్‌లలో విజేతలకు ఇచ్చిన $1.6 మిలియన్ డాలర్ల కంటే రెట్టింపు కంటే ఎక్కువ. ఫైనల్‌లో ఓడిన జట్టు $2.16 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 18.46 కోట్లు అందుకుంటుంది.
ఫైనల్‌కు అర్హత సాధించని మిగతా ఎనిమిది జట్లు కూడా WTC పాయింట్ల టేబుల్‌లో వారి స్థానం ఆధారంగా ప్రైజ్ మనీ పొందుతాయి. ఈ సారి ఈ జట్లకు కూడా గత ఎడిషన్‌లతో పోలిస్తే ఎక్కువ మొత్తం అందనుంది. మూడవ స్థానంలో ఉన్న ఇండియాకు రూ.12.31 దక్కుతాయి.