Andhra Pradesh Latest News | జనం సొమ్ముతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ జల్సాలు చేస్తున్నారని వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, అప్పులు పుట్టడం లేదు అని చంద్రబాబు ఓ వైపు అంటున్నారు, కానీ మరోవైపు మాత్రం రూ.172 కోట్లతో విలాసవంతమైన హెలికాప్టర్ కొనుగోలు చేశారని జగన్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
చినబాబు షికారు కోసం రూ.172 కోట్ల ప్రజల డబ్బుతో ప్రభుత్వం హెలికాప్టర్ కొనుగోలు చేసిందని పేర్కొంది. వైసీపీ చేసిన ఆరోపణలపై తెలుగు దేశం పార్టి తీవ్రంగా స్పందించింది. మంత్రి లోకేష్ మీద ఏడుపు కొద్దీ ఫేక్ గాళ్ళు చేసే ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, అదంతా అబద్దమని టీడీపీ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది.
రూ.172 కోట్ల ప్రజాధనంతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కోసం విలాసవంతమైన హెలికాఫ్టర్ ను ప్రభుత్వం కొంటున్నట్టు తన సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫేక్ పోస్ట్ పెట్టించారని మండిపడింది. తన విలాసాల కోసం బీచ్ వ్యూతో, రుషికొండ ప్యాలెస్ కి రూ.500 కోట్లు తగలేసాడని, తన పార్టీ ఆఫీసుల కోసం 26 జిల్లాల్లో, 26 ప్యాలెస్ లకి రూ.900 కోట్లు, ఎగ పఫ్ లకి రూ.3.6 కోట్లు, ఇలా ఈ రేంజ్ లో దోపిడీ, జల్సాలు, ప్రపంచంలో ఏ నియంత కూడా చేసి ఉండరేమోనని జగన్ ను ఉద్దేశించి టీడీపీ ఎద్దేవా చేసింది.