Saturday 13th June 2026
12:07:03 PM
Home > తాజా > స్వీటెస్ట్ గర్ల్ అంటూ సమంతకు నయనతార విషెస్!

స్వీటెస్ట్ గర్ల్ అంటూ సమంతకు నయనతార విషెస్!

nayan wishes to sam

Nayanatara Wishes To Samantha | టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత (Samantha) నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా దక్షిణాది ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “హ్యాపీ బర్త్‌ డే స్వీటెస్ట్ గర్ల్ సమంత” అని పోస్ట్ చేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. ‘ఓ బేబీ’ వంటి హిట్ తర్వాత నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’.

రాజ్ నిడిమోరు క్రియేట్ చేసిన ఈ ఫ్యామిలీ యాక్షన్ కామెడీ డ్రామాను సమంత స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సమంత ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్’ తర్వాత సామ్ ఇందులో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌ లు చేశారు.

విశేషమేమిటంటే, ఈ యాక్షన్ సీన్లన్నీ ఆమె చీరకట్టులోనే చేయడం సినిమాకే హైలైట్ కానుంది. ఈ ఏడాది అత్యంత ఆసక్తికరంగా మారిన ‘మా ఇంటి బంగారం’ మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇందులో దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషిస్తుండగా.. శ్రీముఖి, గౌతమి తదితరులు నటిస్తున్నారు. ఒక మహిళ బలం ఆమెలోని ధైర్యం మరియు సున్నితత్వంలో ఉంటుందనే సందేశంతో ఈ సినిమా సాగనుందని సమంత గతంలోనే వెల్లడించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions