- 14 ప్రత్యేక బృందాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!
– అందరూ మహిళా సిబ్బందే..
– ఆపదలో ఉంటే నిమిషాల్లో చెంతకు!
CM Revanth Launches Spandana | తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కొత్తగా ఏర్పాటు చేసిన ‘స్పందన’ (తక్షణ రక్షణ) బృందాల వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
స్పందన టీమ్స్ – ప్రత్యేకతలు..
ఈ వ్యవస్థలో డ్రైవర్ నుండి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ మహిళలే ఉంటారు. దీనివల్ల బాధితులు తమ సమస్యలను మరింత స్వేచ్ఛగా, ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. నగరవ్యాప్తంగా ప్రాథమికంగా 14 ప్రత్యేక బృందాలను అందుబాటులోకి తెచ్చారు.
ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు ఈ బృందాలు క్షణాల్లో చేరువయ్యి తక్షణ సాయం అందిస్తాయి. బాధితుల వద్దకు వెళ్ళిన స్పందన టీమ్స్, ముందుగా వారికి మానసిక ధైర్యాన్ని (Counseling) కల్పిస్తాయి. ఆ తర్వాత అవసరమైన చట్టపరమైన చర్యలు చేపడతాయి.
ఇప్పటికే ఉన్న షీ టీమ్స్, ‘స్టాండ్ విత్ హర్’ వంటి కార్యక్రమాలకు తోడుగా ‘స్పందన’ టీమ్స్ పని చేస్తాయని, ఇది సురక్షిత హైదరాబాద్ వైపు మరో ముందడుగు అని సీఎం పేర్కొన్నారు.
నగర పోలీసులు, పీస్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో ఈ టీమ్‌ల పనితీరును సీఎం సమీక్షించారు. ఆపదలో ఉన్న వారు తక్షణమే ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.






