Saturday 6th June 2026
12:07:03 PM
Home > తాజా > ‘పెద్ది’ హీరోయిన్ సీన్లపై వివాదం.. సారీ చెప్పిన బుచ్చిబాబు!

‘పెద్ది’ హీరోయిన్ సీన్లపై వివాదం.. సారీ చెప్పిన బుచ్చిబాబు!

Buchi Babu Apologizes For Heroine Character Scenes | గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర రూపకల్పన, కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు కోరారు. అంతేకాకుండా, అభ్యంతరకరంగా ఉన్న ఆయా సన్నివేశాలను మార్చడం లేదా పూర్తిగా తొలగించేలా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.

జాన్వీ కపూర్ సీన్లపై సెలబ్రెటీల అభ్యంతరం..
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. అయితే సినిమాలో ఆమెకు సంబంధించిన కొన్ని సీన్లు, క్యారెక్టర్ డిజైన్ శృతిమించేలా ఉన్నాయంటూ ప్రేక్షకుల నుండి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.

సాధారణ నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు సైతం ఈ సన్నివేశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.

మహిళలపై ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది..
బుచ్చిబాబు ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు సానుకూలంగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.  సినిమా అనేది కేవలం ప్రేక్షకులను అలరించడానికేనని, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి లేదా ఎవరి గౌరవానికి భంగం కలిగించడానికి కాదని ఆయన స్పష్టం చేశారు.

‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ సీన్లపై వస్తున్న విమర్శలను తాను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. మహిళల పట్ల తనకు ఎల్లప్పుడూ అత్యున్నత గౌరవం ఉంటుందని, వారి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని బుచ్చిబాబు వివరించారు.

ఈ క్యారెక్టర్ వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. ప్రస్తుతం వస్తున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ‘పెద్ది’ సినిమాలోని వివాదాస్పద సీన్లలో తక్షణమే మార్పులు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

You may also like
‘నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం.. ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions