Thursday 22nd October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమిత్ షా 62వ పుట్టినరోజు: ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు!

అమిత్ షా 62వ పుట్టినరోజు: ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు!

PM Modi Wishes Amit Shah On 62nd Birthday కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 62వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా పరిపాలనా అనుభవం, సమర్థవంతమైన నిర్ణయాలు దేశ అంతర్గత భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేశాయని ప్రధాని ప్రశంసించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) ద్వారా సందేశాన్ని పంచుకున్న ప్రధాని మోదీ.. దేశంలో మావోయిజం రహిత సమాజ నిర్మాణం, మాదకద్రవ్యాల (మత్తు పదార్థాలు) రహిత భారత్ లక్ష్యంగా అమిత్ షా సాధించిన విజయాలను ప్రత్యేకంగా కొనియాడారు. దేశ ప్రజల సేవలో ఆయన దీర్ఘకాలం పూర్తి ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు.

ప్రధాని మోదీ శుభాకాంక్షలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ ‘X’ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. “మీరు అందించిన ప్రశంసనీయమైన వ్యాఖ్యలు.. దేశ అభివృద్ధి, సమగ్రత మరియు సమృద్ధి దిశగా మా నిబద్ధతను మరింత పటిష్టం చేస్తాయి” అని పేర్కొన్నారు.

దేశ భద్రతకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే మావోయిజం మరియు డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మూలాల నుంచి నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నామని అమిత్ షా పునరుద్ఘాటించారు. క్యాబినెట్ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ఎస్. జైశంకర్ సహా పలువురు ప్రముఖులు మరియు సీఎంలు కూడా అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

You may also like
వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!
ఇన్‌స్టాగ్రామ్‌ లోకి సోనియా గాంధీ ఎంట్రీ.. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే!
new trains from hyderabad
మొబైల్స్‌లో పెద్ద శబ్దాలతో పాటలు వింటే జైలుకే!
అపరిశుభ్రమైన టాయిలెట్ ఫోటో పంపితే రూ.1000 FASTag రీఛార్జ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions