Friday 27th November 2026
12:07:03 PM
Home > తాజా > విద్యుత్ షాక్‌కు గురైన లైన్మెన్‌కు స్తంభం పైనే సీపీఆర్ చేసి..!

విద్యుత్ షాక్‌కు గురైన లైన్మెన్‌కు స్తంభం పైనే సీపీఆర్ చేసి..!

CPR On Electric Pole విధి నిర్వహణలో ఉన్న ఓ విద్యుత్ లైన్మెన్‌కు స్తంభంపైనే మృత్యువు ఎదురైంది. మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగలడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి, స్తంభంపైనే తీగల మధ్య వేలాడుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడారు.

కింద ఉన్నవారంతా ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్న క్లిష్ట సమయంలో ఓ వ్యక్తి అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి ప్రదర్శించి నిండు ప్రాణాన్ని కాపాడారు. ఈ హృదయ విదారక, సాహసోపేత ఘటన అనంతపురం జిల్లా కంబదూరులో చోటుచేసుకుంది.

రియల్ హీరో సాహసం..

కంబదూరులో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు నిర్వహిస్తున్న లైన్మెన్‌కు అకస్మాత్తుగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఆయన స్పృహ కోల్పోయి స్తంభంపైనే తీగల మధ్య ఇరుక్కుపోయి వేలాడారు. కింద ఉన్న స్థానికులు, సిబ్బంది భయాందోళనకు గురవుతుండగా, అక్కడే ఉన్న ఓ వ్యక్తి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రాణాలకు తెగించి విద్యుత్ స్తంభం పైకి ఎక్కారు.

వేలాడుతున్న లైన్మెన్‌ను సురక్షితంగా పట్టుకుని, కిందకు దించే లోపే సమయం మించిపోతుందని గ్రహించి స్తంభం పైనే వెంటనే సీపీఆర్ (CPR) అందించారు.ఆయన అందించిన సకాలపు సీపీఆర్‌తో లైన్మెన్‌లో తిరిగి కదలిక వచ్చింది. అనంతరం స్థానికుల సహాయంతో ఆయనను సురక్షితంగా కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. ఆపద సమయంలో ప్రాణాలకు తెగించి స్తంభం పైనే సీపీఆర్ చేసిన ఆ వ్యక్తి సాహసాన్ని స్థానికులు, నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions