Friday 13th November 2026
12:07:03 PM
Home > తాజా > టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం!

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం!

  • ‘కాకా’ షూటింగ్ ముగించుకుని వస్తుండగా ఢీకొట్టిన ట్రక్!

Choreographer Sekhar Master Car Accident టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’ (Kaaka) పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. శంషాబాద్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో కారు వెనుక భాగం నుజ్జునుజ్జ యినప్పటికీ, అదృష్టవశాత్తూ శేఖర్ తో పాటు ఉన్న వారికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. క్షేమంగా బయటపడ్డారు.

వెనుక నుండి ఢీకొట్టిన పండ్ల ట్రక్..

‘కాకా’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని శేఖర్ మాస్టర్ తన బృందంతో కలిసి కారులో హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. శంషాబాద్ పరిసర ప్రాంతాలకు చేరుకోగానే, పండ్ల లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న ఓ ట్రక్ ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ట్రక్ ఢీకొట్టిన ధాటికి కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే ప్రమాద సమయంలో కారులో ఉన్న శేఖర్ మాస్టర్‌ తోపాటు కారులో ఉన్న మిగతా వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ప్రమాద తీవ్రతను, దెబ్బతిన్న కారు పరిస్థితిని చూస్తే పెను ప్రమాదమే తప్పినట్లు కనిపిస్తోంది. శేఖర్ మాస్టర్ సురక్షితంగా ఉన్నారని తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు, మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

You may also like
Fauji photos leaked
ప్రభాస్ ‘ఫౌజీ’ ఫోటోల లీక్.. చిత్ర యూనిట్ వార్నింగ్!
Renu Desai
రేణు దేశాయ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. ఆరుగురు అరెస్ట్!
Chiranjeevi
మెగాస్టార్ సినిమాలో యంగ్ హీరోయిన్.. ఎవరంటే!
chiranjeevi
చిరంజీవిపై పరువునష్టం, క్రిమినల్ కేసు పెడ్తా: తమిళ నటుడు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions