Saturday 1st August 2026
12:07:03 PM
Home > క్రైమ్ > మానవ అక్రమ రవాణా కేసులు.. టాప్‌లో తెలంగాణ!

మానవ అక్రమ రవాణా కేసులు.. టాప్‌లో తెలంగాణ!

Cases of human trafficking.. Telangana at the top!

-హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో తెలంగాణ టాప్
-గతేడాది రాష్ట్రంలో 391కేసుల నమోదు
-704 మందిని కాపాడిన పోలీసులు
-దేశవ్యాప్తంగా 2250 కేసుల నమోదు
-ఎన్సీబీ తాజా వివరాల్లో వెల్లడి

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా వివరాల ప్రకారం అత్యధిక మానవ అక్రమ రవాణా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది.
ఎన్సీబీ నివేదికలోని ముఖ్యాంశాలు..

గతేడాది దేశవ్యాప్తంగా 2250 కేసులు నమోదు కాగా 391 కేసులు తెలంగాణలో వెలుగు చూశాయి.
ఈ కేసుల్లో 25 మంది బాలికలు, 9 మంది మంది బంగ్లాదేశ్ యువతులు, 641 మంది మహిళలు, 38 మంది బాలురుతో సహా మొత్తం 704 మందిని రాష్ట్ర పోలీసులు కాపాడారు.
బాధితుల్లో కొందరిని రెస్క్యూ హోమ్స్‌కు బాలకార్మికులను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. మరికొందరిని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు.
600 మందికి పైగా మహిళలు, 100 మంది చిన్నారులకు మెట్రో నగరాలకు అక్రమంగా తరలించినట్టు ఎన్సీబీ నివేదిక చెబుతోంది. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలతో పాటూ ఇతర రాష్ట్రాల యువతులు, మైనర్లును అక్రమంగా రవాణా చేస్తున్నారు.
తెలంగాణలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందాలు క్రియాశీలకంగా ఉండటంతో నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఉద్యోగం, ఉపాధి, ప్రేమ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తెలంగాణకు రప్పిస్తున్నారు. చివరకు వ్యభిచార కూపాల్లో దించుతున్నారు.
బీహార్, యూపీ సహా ఉత్తరాది రాష్ట్రాల నుంచి బాలకార్మికుల అక్రమ రవాణా సాగుతోంది.
రాష్ట్రంలో మానవ అక్రమరవాణాకు చెక్ పెట్టేందుకు 30 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
కేంద్రం గైడ్‌లైన్స్ ప్రకారం సీఐడీ పోలీసులు, స్వచ్చంధ సంస్థలు, చైల్డ్ ప్రొటెక్షన్, లోకల్ పోలీసులు ఆపరేషన్ స్మైల్ పేరుతో దాడులు నిర్వహిస్తున్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions