Saturday 1st August 2026
12:07:03 PM
Home > తాజా > NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. దేవర అప్ డేట్ టీజర్ ఎప్పుడంటే!

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. దేవర అప్ డేట్ టీజర్ ఎప్పుడంటే!

devara

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం దేవర (Devara). పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన అలనాటి అతిలోకసుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ (Siaf Ali Khan) ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ (Anirudh) సంగీతం సమకూరుస్తున్నారు.

ఆస్కార్ అవార్డ్ పొందిన ట్రిపుల్ ఆర్ (RRR) సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో దేవరపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు తొలి పార్టులుగా రూపొందిస్తున్న ఈ సినిమా తొలి భాగాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉండగా దేవర టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు చిత్ర యూనిట్ కొత్త సంవత్సరం సందర్భంగా ఓ శుభవార్త చెప్పింది. టీజర్ అప్‌డేట్ ఇచ్చారు నిర్మాతలు.

దేవర టీజర్‌ను జనవరి 8న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది.

ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ సముద్రంలో పడవపై నిలబడి ఉన్నారు. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవర గ్లింప్స్‌ ను జవవరి 8న మీ ముందుకు తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ఎన్టీఆర్ ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు.  

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
సోషల్ మీడియా ట్రోల్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions