Friday 14th August 2026
12:07:03 PM
Home > తెలంగాణ > పెనుబల్లి బ్రిడ్జిని పరిశీలించిన ఛైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు

పెనుబల్లి బ్రిడ్జిని పరిశీలించిన ఛైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు

Chairperson and Councilors inspected the Penuballi Bridge

-తాత్కాలిక పనులు చేపట్టాలి : ఛైర్‌పర్సన్‌..
పాతకొత్తగూడెంలో కొత్తగూడెం మున్సిపాల్టీ పెను బల్లి పంచాయతీ పరిధిలో గల పెనుబల్లిబ్రిడ్జి తుఫా న్‌ కారణంగా కృంగిపోవడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే మున్సిపల్‌ఛైర్‌పర్సన్‌ కాపు సీతా లక్ష్మీ హుటాహుటిన కౌన్సిలర్లతో కలిసి గురు వారం సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిం చారు.. తాత్కాలిక మరమ్మత్తులు చేయాల్సిందిగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన అవ సరం ఉందని చరవాణి ద్వారా అధికారులను కోరారు. అవసరమైతే కాలనడకన మాత్రమే వెళ్లాలని బండ్లు బ్రిడ్జిలపై నుండి నడపవద్దని ప్రజలను కోరా రు. ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హైలెవెల్‌ నూతన బ్రిడ్జికి శంకుస్థా పన చేయడం జరిగిందని దాన్ని ఇటువంటి పరిస్థితు ల్లో వెంటనే బ్రిడ్జిపనులు చేసే విధంగాచర్యలు తీసు కోవాలని అధికారులను కోరారు. తుఫాను ప్రభావం అధికంగా ఉన్నందున ప్రజలందరూ అప్ర మత్తంగా ఉండాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పరమేష్‌యాదవ్‌, ధర్మరాజు, బండి నరసింహ, రుక్మాంధర్‌బండారి, బీఆర్‌ఎస్‌ నాయకులు రజాక్‌, యూసుఫ్‌ వాసు తదితరులు పాల్గొన్నారు..

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions