Thursday 10th September 2026
12:07:03 PM
Home > క్రైమ్ > “నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా? లేదా?”

“నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా? లేదా?”

ప్రియుడిపై వివాహిత ఒత్తిడి, బయటపడ్డ హత్య కుట్ర!

Wife Plans Husband Murder | తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్తనే కడతేర్చేందుకు ఒక వివాహిత తన ప్రియుడితో కలిసి హత్య కుట్ర పన్నింది. ఈ షాకింగ్ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో వెలుగు చూసింది.

తన భార్య, ఆమె ప్రియుడు కలిసి తనను హత్య చేసేందుకు ప్రణాళిక రచించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని బాధితుడు డోర్నకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కొరియర్ బాయ్‌తో వివాహేతర సంబంధం..

డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదె రాజేశ్వరరావుకు 2016లో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన భవానీతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజేశ్వరరావు ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నారు.

గత కొన్ని నెలలుగా భార్య ప్రవర్తనలో మార్పు రావడం రాజేశ్వరరావు గమనించారు. ఖమ్మంలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్న సైదులు అనే వ్యక్తితో భవానీకి పరిచయమేర్పడి, అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ఇంట్లో లేని సమయంలో సైదులు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు.

భర్త అడ్డు తొలగించుకునేందుకు కుట్ర:

తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భవానీ, సైదులు.. అతడిని లేకుండా చేస్తే ఆనందంగా జీవించవచ్చని పథకం వేశారు. ఈ క్రమంలో “నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా? లేదా?” అంటూ భవానీ తన ప్రియుడిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాల ద్వారా బయటపడింది.

ఆధారాలతో పోలీసులను ఆశ్రయించిన భర్త..

తన భార్య, ఆమె ప్రియుడు కలిసి తనను ప్రమాదం పేరిట హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని తెలుసుకున్న రాజేశ్వరరావు, వారిద్దరి మధ్య నడిచిన సెల్‌ఫోన్ సందేశాలు (Chatting Messages), ఇతర ఆధారాలను సేకరించారు.

సస్కరింపబడిన అన్ని ఆధారాలను డోర్నకల్ పోలీసులకు అందజేస్తూ, తనకు మరియు తన ఇద్దరు కుమార్తెలకు భద్రత కల్పించాలని, భార్య భవానీ, ప్రియుడు సైదులుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన డోర్నకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

You may also like
గణేశ్ చతుర్థి వేళ చిరంజీవి కీలక పిలుపు!
BJP Kishan REddy
జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలి: కిషన్ రెడ్డి!
cm revanth reddy
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో!
నగరంలో రోడ్ల వ్యవస్థ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions