Thursday 17th September 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల!

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల!

Election commission
  • నవంబర్ 6 వరకు దరఖాస్తుకు అవకాశం!

TG Graduate MLC Voter Registration Schedule తెలంగాణలోని పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (EC) కీలక షెడ్యూల్‌ను విడుదల చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ మరియు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ కార్యచరణను వెల్లడించింది.

ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు వాణీ దేవి, తీన్మార్ మల్లన్న పదవీకాలం వచ్చే మార్చిలో ముగియనుండటంతో ఎన్నికల కమిషన్ ఈ దిశగా కసరత్తు ప్రారంభించింది.

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కీలక తేదీలు ఇవే..

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు సంబంధించి ఈ నెల 20న (సెప్టెంబర్ 20) ఎన్నికల సంఘం అధికారిక పబ్లిక్ నోటీసు జారీ చేస్తుంది. అర్హులైన పట్టభద్రుల నుంచి నవంబర్ 6 వరకు ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. నవంబర్ 25న డ్రాఫ్ట్ (ముసాయిదా) ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, సవరణలు ఉంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరిశీలన అనంతరం డిసెంబర్ 30న గ్రాడ్యుయేట్ ఓటర్ల ఫైనల్ (తుది) జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు.

అందరూ కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే..

గతంలో ఎమ్మెల్సీ ఓటరుగా నమోదై ఓటు వేసిన వారు కూడా తప్పనిసరిగా మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) స్పష్టం చేశారు. పాత ఓటర్ల వివరాలు ఆటోమేటిక్‌గా పరిగణనలోకి రావని, అర్హులైన పట్టభద్రులంతా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions