Wednesday 12th August 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘BIG BREAKING : ఐపీఎల్ నిరవధిక వాయిదా’

‘BIG BREAKING : ఐపీఎల్ నిరవధిక వాయిదా’

IPL 2025 suspended with immediate effect for one week | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 నిరవధిక వాయిదా పడింది. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో ప్రేక్షకుల, ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

దేశం యుద్ధం అంచున ఉన్న తరుణంలో ఐపీఎల్ నిర్వహించడం సరికాదని బీసీసీఐ అధికారులు వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత తిరిగి ఐపీఎల్ ను నిర్వహించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

గురువారం రాత్రి ధర్మశాల వేదికగా జరిగిన పంజాబ్-ఆర్సీబీ మ్యాచును భద్రతా కారణాల రీత్యా మధ్యలోనే రద్దు చేసిన విషయం తెల్సిందే. ఇకపోతే ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో మరో 12 లీగ్ మ్యాచులు ఉన్నాయి. అలాగే క్వాలీఫయర్ 1, 2, ఎలిమినేటర్ మరియు ఫైనల్స్ కూడా ఉన్నాయి.

ఐపీఎల్ ను నిరవధిక వాయిదా వేసినప్పటికీ తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దేశం, భద్రతే ముఖ్యమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గుజరాత్, బెంగళూరు, పంజాబ్ చెరో 16 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉండగా, 14 పాయింట్లతో ముంబయి నాలుగవ స్థానంలో ఉంది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions