- హాల్ టికెట్ నంబర్ పంపితే చాలు.. మార్కుల మెమో ప్రత్యక్షం!
- ‘మీ సేవ’ కొత్త సదుపాయం ఇలా..
SSC Results in WhatsApp | తెలంగాణ పదో తరగతి (SSC) ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదలైన వెంటనే వెబ్‌సైట్లపై ఒత్తిడి పెరిగి ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఈసారి ‘వాట్సాప్’ ద్వారా ఫలితాలను పొందే వెసులుబాటు కల్పించింది.
‘మీ సేవ’ వాట్సాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులు తమ మార్కుల మెమోను నేరుగా ఫోన్‌లోనే పొందవచ్చు.
వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందే విధానం:
- నెంబర్ సేవ్ చేసుకోండి: ముందుగా మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను “MeeSeva Telangana” పేరుతో సేవ్ చేసుకోండి.
- మెసేజ్ పంపండి: వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపాలి.
- సర్వీస్ ఎంపిక: మెనూలో “SSC Result” అని టైప్ చేసి, ‘Open Service’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- హాల్ టికెట్ ఎంటర్ చేయండి: మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి వివరాలు సమర్పిస్తే, వెంటనే మీ మార్కుల మెమో వాట్సాప్‌లోకి వస్తుంది.
బుధవారం మధ్యాహ్నం 2:30 గంటల నుండి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పౌరసరఫరాల శాఖ మరియు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం తెలిపింది.






