Wednesday 29th April 2026
12:07:03 PM
Home > క్రీడలు > డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ ధూమపానం.. జైలు శిక్ష తప్పదా?

డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ ధూమపానం.. జైలు శిక్ష తప్పదా?

riyan parag

Riyan Parag Smoking Controversy | రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals) కెప్టెన్ రియాన్ పరాగ్ పెద్ద చిక్కుల్లో పడ్డారు. పంజాబ్ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయన బహిరంగంగా ఈ-సిగరెట్ (E-Cigarette) తాగుతూ కెమెరా కంటికి చిక్కడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే..
మంగళవారం న్యూ చండీగఢ్ వేదికగా పంజాబ్-రాజస్థాన్ మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. రాజస్థాన్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో (16వ ఓవర్లో), డ్రెస్సింగ్ రూమ్‌లో తోటి ఆటగాళ్లు జైస్వాల్, ధృవ్ జురేల్ పక్కనే కూర్చున్న పరాగ్ ఈ-సిగరెట్ ఉపయోగిస్తూ కనిపించారు.

నిబంధనల ఉల్లంఘన..
ఐసీసీ మరియు బీసీసీఐ నిబంధనల ప్రకారం స్టేడియం ఆవరణలో లేదా డ్రెస్సింగ్ రూమ్‌లో ధూమపానం చేయడం నిషిద్ధం.

భారత్‌లో ‘ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం-2019’ ప్రకారం ఈ-సిగరెట్ల వాడకం, విక్రయం నేరం. ఈ చట్టం కింద మొదటిసారి నేరానికి పాల్పడితే ఏడాది జైలు శిక్ష లేదా రూ. లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

బీసీసీఐ చర్యలు ఎలా ఉంటాయి..
క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు పరాగ్‌పై భారీ జరిమానా లేదా కొన్ని మ్యాచ్‌ల పాటు నిషేధం విధించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions