Monday 3rd August 2026
12:07:03 PM
Home > తాజా > రేవంత్ ప్రమాణ స్వీకార ముహూర్తం మార్పు.. ఎప్పుడంటే!

రేవంత్ ప్రమాణ స్వీకార ముహూర్తం మార్పు.. ఎప్పుడంటే!

revanth reddy

Revanth Reddy Swearing In Ceremony | తెలంగాణ రెండో సీఎంగా కొడంగల్ ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన తర్వాత రెండు రోజులపాటు కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎల్పీ నాయకుడిగా ఎంపిక చేసింది.

దీంతో ఆయన సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధికారులు రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత రేపు ఉదయం 10:28 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

Read Also: “రేవంత్ ఆ.. ఆయనెవరు..?” కేటీఆర్ పాత ట్వీట్ వైరల్.. అదేంటంటే!

కానీ, తాజాగా మార్పులు చేశారు. గురువారం మధ్యాహ్నం 01:04 నిమిషాలకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియానికి తరలిరానున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

You may also like
తెలంగాణలో వారికి కూడా పెన్షన్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions