Thursday 17th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డి’

‘అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డి’

Minister Nara Lokesh Fires On Ys Jagan | గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ( Vallabhaneni Vamsi ) ని అక్రమ కేసులో అరెస్ట్ చేశారని మాజీ సీఎం జగన్ కూటమి సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

ఈ మేరకు విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ములాఖత్ లో కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కట్టుకథ అల్లి వంశీని అరెస్ట్ చేశారని జగన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో జగన్ పై విరుచుకుపడ్డారు మంత్రి నారా లోకేశ్.

నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు? అని ప్రశ్నించిన లోకేశ్ పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ ( Confident ) గా చెప్పడంలో జగన్ పీహెచ్డీ ( Phd ) చేసినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు.

ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రావాలని, 100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూసారని పేర్కొన్నారు.

కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు జగన్ రెడ్డి బ్రాండ్ అని, అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని లోకేశ్ ఫైర్ అయ్యారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions