Air India Schedule From Bhogapuram Airport | భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా తన విమాన షెడ్యూల్‌ను ప్రకటించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం భోగపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి వాణిజ్య విమాన కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండే షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా విడుదల చేసింది. హైదరాబాద్-భోగపురం మధ్య రోజుకు ఐదు విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది.
బెంగళూరు-భోగపురం మార్గంలో రోజుకు రెండు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అదనంగా ఆదివారం, శుక్రవారం మినహా వారంలో ఐదు రోజుల పాటు మరో ప్రత్యేక సర్వీస్ నడపనుంది.
విజయవాడ-భోగపురం మధ్య రోజుకు నాలుగు విమాన సర్వీసులు నిర్వహించనున్నట్లు కూడా ఎయిర్ ఇండియా వెల్లడించింది.
భోగపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు దేశంలోని ప్రధాన నగరాలతో మెరుగైన విమాన అనుసంధానం లభించనుంది. వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు కూడా ఈ విమానాశ్రయం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.







