- న్యూయార్క్ ఆకాశంలో మళ్లీ మెరిసిన ట్విన్ టవర్స్
2977 Drones New York Harbor 911 Tribute సెప్టెంబర్ 11, 2001 ఉగ్రదాడుల 25వ వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్ నగరంలో అత్యంత భావోద్వేగభరితమైన నివాళి కార్యక్రమం జరిగింది.
“2,977 లైట్స్ ఓవర్ న్యూయార్క్ హార్బర్” పేరుతో నిర్వహించిన ఈ ప్రదర్శనలో 2,977 వెలుగుతున్న డ్రోన్లు ఆకాశంలోకి ఎగిరి, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రతీ ఒక్కరికీ గుర్తుగా నిలిచాయి.
ట్విన్ టవర్స్ పునఃసృష్టి..
న్యూయార్క్ హార్బర్ పైభాగాన నీటిపై నుంచి ఎగిరిన డ్రోన్లు ఆకాశంలో ఒకచోటికి చేరి, ఒకప్పటి ప్రపంచ వాణిజ్య సంస్థ (ట్విన్ టవర్స్) నమూనాను పూర్తి ఆర్కిటెక్చరల్ స్కేల్లో వెలుగుల రూపంలో ఆవిష్కరించాయి. ఈ ప్రదర్శనలోని 2,977 డ్రోన్లలో ప్రతి ఒక్కటి 9/11 దాడుల్లో మరణించిన ఒక్కో వ్యక్తికి గుర్తుగా అమర్చబడిందని ప్రాజెక్ట్ క్రియేటివ్ డైరెక్టర్ అడిసన్ మెహర్ తెలిపారు.
ఈ బహిరంగ కళాఖండాన్ని ఉగ్రదాడి బాధితుల కుటుంబ సభ్యులు, ప్రాణాలతో బయటపడినవారు, మరియు ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న ఫైర్ ఫైటర్లు (FDNY), పోలీసుల (NYPD) సలహాలు, ఆలోచనలతో రూపొందించారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్..
ఆకాశంలో డ్రోన్లు ట్విన్ టవర్స్‌గా రూపాంతరం చెందుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నగరవాసులు ఈ దృశ్యాలను చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.







