Abhishek Sharma L Celebrations | భారత్ ఇంగ్లాండ్ మధ్య బుధవారం ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens ) వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెల్సిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 132 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య చేదనకు దిగిన టీం ఇండియా కేవలం 12.5 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 34 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్లతో 79 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన శర్మ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. బొటనవేలు, చూపుడు వేలును పైకి చూపిస్తూ అభివాదం చేశాడు. అయితే తాను అలా చేయడానికి గల కారణాన్ని మ్యాచ్ అనంతరం అభిషేక్ వివరించారు.
కోచ్ మరియు కెప్టెన్ కోసమే అలా సంబరాలు చేసుకున్నట్లు చెప్పారు. కోచ్ గంభీర్ ( Gautam Gambhir ), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Surya Kumar Yadav ) పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు. అలాగే యువ క్రికెటర్లతో వారు మాట్లాడే విధానం బాగుంటుందన్నారు.