Actor Vishwak Sen About His New Look In ‘Laila’ Movie | నటుడు విశ్వక్ సేన్ ( Vishwak Sen ) కథానాయకుడిగా ‘లైలా’ అనే సినిమా ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ ( Lady Getup ) లో కనిపిస్తున్న విషయం తెల్సిందే. గురువారం ఈ మూవీ నుండి ‘ఇచ్చుకుందాం బేబీ..ముద్దు ఇచ్చుకుందాం బేబీ’ అనే పాటను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన విశ్వక్ సేన్ తాను లైలా గెటప్ లో ఉన్న సమయంలో తండ్రికి వీడియో కాల్ ( Video Call ) చేస్తే ఆయన గుర్తుపట్టలేకపోయారని పేర్కొన్నారు. కథ విన్న వెంటనే మూవీకి ఓకే చెప్పినట్లు తెలిపారు. ఇలాంటి జోనర్ లో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నట్లు చెప్పారు.
లైలా గెటప్ వేసుకున్న అనంతరం తండ్రికి వీడియో కాల్ చేస్తే చాలా సేపు ఆయన సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారని, ‘డాడీ నేను’ అని అనగానే తండ్రి ఒక్కసారిగా కంగారుపడిపోయారని గుర్తిచేసుకున్నారు.
కన్న తండ్రే గుర్తుపట్టలేకపోయారు, ఈ మూవీ కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని విశ్వక్ సేన్ ధీమా వ్యక్తం చేశారు.