Sunday 2nd August 2026
12:07:03 PM
Home > తాజా > ‘నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు’

‘నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు’

Vijay Devarakonda Latest | తాను ప్రమోట్ చేసింది ప్రభుత్వం ద్వారా అనుమతి పొందిన గేమింగ్ యాపునే అని స్పష్టం చేశారు నటుడు విజయ్ దేవరకొండ. గేమింగ్ యాప్ లు దేశ క్రికెట్ జట్టు, ఒలింపిక్ జట్లను స్పాన్సర్ కూడా చేశాయన్నారు.

బెట్టింగ్ యాప్ కి గేమింగ్ యాప్ కి అసలు సంబంధమే లేదన్నారు. మంగళవారం నటుడు ఈడీ ఎదుట విచారణకు హాజరైన విషయం తెల్సిందే. సుమారు నాలుగు గంటల పాటు విచారణ జరిగింది. అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడారు.

బెట్టింగ్ యాప్ లో తన పేరు రావడంతో విచారణకు పిలిచినట్లు చెప్పారు. దేశంలో గేమింగ్, బెట్టింగ్ యాప్ లు ఉన్నాయని వివరించారు. తాను ప్రమోట్ చేసి A23 అనేది కేవలం గేమింగ్ యాప్ మాత్రమే అని తెలిపారు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి ఉందన్నారు.

అలాగే జిఎస్టీ, ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ కూడా ఉన్నాయన్నారు. ఇదే విషయాన్ని ఈడీ అధికారులకు వివరించినట్లు విజయ్ దేవరకొండ మీడియాతో చెప్పారు. తాను A23 అనే గేమింగ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈడీ అధికారులకు బ్యాంకు లావాదేవీల వివరాలను సమర్పించినట్లు పేర్కొన్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions