Wednesday 14th October 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!

జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!

  • విజయవాడ మేయర్ అభ్యర్థిగా తెరపైకి పేరు!

Vangaveeti Radhakrishna Joins Janasena ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ బుధవారం జనసేన పార్టీలో అధికారికంగా చేరారు. అమరావతిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాధాకృష్ణతో పాటు తిరుపతికి చెందిన ప్రణీత్‌ ప్రమోద్‌ కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామంతో విజయవాడ నగర రాజకీయాలు వేడెక్కాయి. రాధాకృష్ణ జనసేన తరఫున విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది.

సార్వత్రిక ఎన్నికల నుంచి సేవలు..

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థుల విజయానికి వంగవీటి రాధాకృష్ణ విస్తృతంగా ప్రచారం చేసి కృషి చేశారు. వైసీపీని వీడిన అనంతరం టీడీపీతో కలిసి పనిచేసిన ఆయన, ప్రస్తుతం జనసేనలో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమరం: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (SEC) అనిల్‌ చంద్ర పునేఠా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం, ప్రభుత్వం మేయర్లు, జడ్పీ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గెజిట్‌లు విడుదల చేసిన నేపథ్యంలో రాధాకృష్ణ చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది.

డివిజన్ల కేటాయింపుపై చర్చలు..

విజయవాడ కార్పొరేషన్‌లోని 86 డివిజన్లలో 35 స్థానాలను జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ కోరుతున్నట్లు సమాచారం. అయితే టీడీపీ 15 స్థానాలను ఇచ్చేందుకు మొగ్గు చూపుతోందని టాక్ నడుస్తోంది. కూటమి తరఫున సీట్ల సర్దుబాటుపై జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, లింగమనేని రమేశ్‌, హరిప్రసాద్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. సీట్ల పంపకాలపై త్వరలోనే అధికారిక స్పష్టత రానుంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions