Friday 31st July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > విషాదం.. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి!

విషాదం.. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి!

death

Boy Dies of Heart Attack | రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రిస్టమస్ (Christamas) వేడుకల్లో ఆనందంగా ఉన్న కుటుంబం లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు.

వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కొనారావు పేట మండలంలోని నిజామాబాద్ గ్రామనికి చెందిన తాల్లపల్లి శంకర్-సరిత దంపతులకు ఇద్దరు కుమారులు జశ్వంత్ మరియు 13 ఏళ్ల సుశాంత్. కాగా సుశాంత్ ముస్తాబద్ లోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు.

క్రిస్టమస్ పండుగ కోసం ఆదివారం నాడు ఇంటికివచ్చారు సుశాంత్. సోమవారం క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న అతను ఒక్కసారిగా ఛాతినొప్పి తో కింద పడిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే సుశాంత్ ను సిరిసిల్ల లో జిల్లా ఆసుపత్రికి తరలించగా, చికిత్స తీసుకుంటున్న సమయంలో అతను మరణించాడు.

దింతో పండుగ ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా కొంతకాలంగా వయసుతో సంబంధం లేకుండా పిన్న వయసులో ఉన్న వారు కూడా గుండెపోటుతో మరణిస్తుండడం అందర్నీ కలచివేస్తుంది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
తాగునీటికే రిజర్వాయర్ల నీరు: మంత్రి తుమ్మ
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions