Friday 11th September 2026
12:07:03 PM
Home > క్రైమ్ > ఉద్యోగుల కళ్లలో కారం కొట్టి.. నాగ్‌పూర్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ దోపిడీ యత్నం!

ఉద్యోగుల కళ్లలో కారం కొట్టి.. నాగ్‌పూర్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ దోపిడీ యత్నం!

  • రూ. 4 లక్షలతో పారిపోతుండగా పట్టుబడిన బీఎస్సీ గ్రాడ్యుయేట్!

SBI Bank Robbery Nagpur మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలో దారుణమైన దోపిడీ యత్నం జరిగింది.

బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం పొడి చల్లి రూ. 4 లక్షల నగదుతో పారిపోతున్న ఓ యువకుడిని పోలీసులు, బ్యాంక్ సిబ్బంది చాకచాక్యంగా పట్టుకున్నారు. అరెస్టయిన నిందితుడిని 28 ఏళ్ల సూరజ్ భోజ్‌రాజ్ బోర్కర్‌గా పోలీసులు గుర్తించారు.

ఖాతాదారుడిలా వచ్చి దాడి..

నిందితుడు సూరజ్ సాధారణ కస్టమర్‌లా బ్యాంక్‌లోకి ప్రవేశించి నేరుగా క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. హఠాత్తుగా బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం పొడి చల్లి, అక్కడ తలెత్తిన అయోమయాన్ని అనుకూలంగా మార్చుకుని రూ. 4 లక్షల నగదుతో పరారయ్యాడు.

సీసీటీవీలో దృశ్యాలు నిక్షిప్తం..

ఈ దోపిడీ ప్రక్రియ అంతా బ్యాంక్‌లోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. పారిపోతున్న నిందితుడిని బ్యాంక్ సిబ్బంది, అక్కడే ఉన్న పోలీసులు వెంటాడి కిలోమీటరు దూరంలో పట్టుకున్నారు. బిఎస్సీ (B.Sc.) డిగ్రీ పూర్తి చేసిన సూరజ్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడని, ఉద్యోగం లేకపోవడమే ఈ నేరానికి పురికొల్పిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి నుంచి రూ. 4 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions