Thursday 17th September 2026
12:07:03 PM
Home > తాజా > అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా: కేటీఆర్

అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా: కేటీఆర్

ktr comments

KTR Slams TG Government | తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లలో (TG Residential Schools) విద్యార్థినులు కష్టాలపై కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినులకు సంబంధించి ఓ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసిన ఆయన తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా! కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన నా తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా !

దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలికేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపాం ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నమో రామచంద్రా అని ఆకలికేకలా !

పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకులాల్లో చదువుకుని ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులు .. నేడు గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోదించడమా ! సిగ్గు సిగ్గు ఇది పాలకుల పాపం విద్యార్థులకు శాపం జాగో తెలంగాణ జాగో’ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

You may also like
కేసీఆర్ కు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
telangana high court
ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions