Thursday 29th October 2026
12:07:03 PM
Home > తాజా > కేటీఆర్‌కు సారీ చెప్పిన కొండా సురేఖ!

కేటీఆర్‌కు సారీ చెప్పిన కొండా సురేఖ!

  • వ్యక్తిగత వ్యాఖ్యల ఉపసంహరణ!

Konda Surekha Apologizes To KTR తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై గతంలో తాను చేసిన తీవ్ర వివాదాస్పద వ్యక్తిగత వ్యాఖ్యలకు గాను మాజీ మంత్రి కొండా సురేఖ విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

“బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు.

ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.”

కొండా సురేఖ గతంలో కేటీఆర్‌తో పాటు పలువురిపై చేసిన విమర్శలు, ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు న్యాయపరమైన చర్యలకు కూడా సిద్ధమయ్యాయి.

అకస్మాత్తుగా కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం, బహిరంగంగా క్షమాపణలు చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, రాజకీయ కారిడార్లలోనూ వైరల్ అవుతోంది

You may also like
కేసీఆర్ కు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్!
కొండా సురేఖ తొలగింపుపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు!
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సంచలన సిఫారసు.. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై వేటు?
తన సొంత రక్తంతో నాకు లేఖ రాశాడు: మల్లారెడ్డి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions