Monday 26th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > TN రాజకీయాల్లో ‘ధనుష్’ ఎంట్రీ హడావుడి: వెండి దీపాలపై ‘కమలం’ గుర్తు!

TN రాజకీయాల్లో ‘ధనుష్’ ఎంట్రీ హడావుడి: వెండి దీపాలపై ‘కమలం’ గుర్తు!

  • క్లారిటీ ఇచ్చిన నర్పణి ఇయక్కమ్!

Actor Dhanush Silver Lamps Lotus Symbol తమిళ సినీ స్టార్, జాతీయ నటుడు ధనుష్ రాజకీయ అరంగేట్రంపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మళ్లీ షురూ అయ్యాయి. ఆదివారం చెన్నై సెమ్మంజేరిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన ‘ధనుష్ నర్పణి ఇయక్కమ్’ (Dhanush Narpani Iyakkam) మహిళా విభాగం సమావేశంలో పాల్గొన్న మహిళా నిర్వాహకులకు ఆయన కానుకగా పంపిణీ చేసిన వెండి కామాక్షి దీపాలపై ‘కమలం’ (Lotus) గుర్తు ముద్రించి ఉండటం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.

ధనుష్ త్వరలోనే ‘తమిళగ ఎళుచ్చి కజగం’ (Tamilaga Ezhuchi Kazhagam) పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారని, ఈ నేపథ్యంలోనే బీజేపీ (BJP) వెనుక ఉండి ఆయనను ప్రోత్సహిస్తోందంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి.

నర్పణి ఇయక్కమ్ స్పష్టత..

ఈ వివాదంపై ‘ధనుష్ నర్పణి ఇయక్కమ్’ ముఖ్య ప్రతినిధి స్పందిస్తూ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు: వెండి దీపాలపై ఉన్న కమలం గుర్తు కేవలం ఆ వస్తువును తయారుచేసిన సంస్థ (Manufacturer) ముద్రించిన మార్కు మాత్రమేనని, దీనికి ఎటువంటి రాజకీయ ప్రాముఖ్యత లేదా సంకేతం లేదని స్పష్టం చేశారు.

ఇతర పార్టీలతో సంబంధం లేదు..

“మాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. ఒకవేళ ఏదైనా పార్టీతో రాజకీయ పొత్తు లేదా అవగాహన ఉంటే.. మరో పార్టీ ఎన్నికల గుర్తును బహిరంగంగా ఉపయోగించేంత అమాయకులం కాదు” అని ఆయన తేల్చిచెప్పారు. తమిళనాడు నలుమూలల నుంచి సుమారు 3,000 నుంచి 5,000 మందికి పైగా మహిళా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెల్లటి షర్ట్, వేష్టి (ధోతి) ధరించిన ధనుష్ నిర్వాహకులతో కలిసి ఫోటోలు దిగారు.

గంటల తరబడి వేచి చూసిన అభిమానులు, మద్దతుదారుల కోసం ధనుష్ మాట్లాడిన ప్రసంగం కొద్ది నిమిషాలే ముగిసింది. ప్రసంగంలో అందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. బాగా చదువుకోవాలని, జాగ్రత్తగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని సూచిస్తూ ఓ పాట కూడా పాడారు.

సంస్థ పునర్వ్యవస్థీకరణ..

ఇటీవలే ధనుష్ తన అభిమాన సంఘాలను ‘ధనుష్ నర్పణి ఇయక్కమ్’గా మార్చారు. దీనికి సంబంధించి ఆల్ ఇండియా అధ్యక్షుడు సుబ్రమణ్య శివ ఆధ్వర్యంలో కొత్త లోగోను కూడా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా నూతన పదాధికారులను నియమిస్తూ నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యకలాపాలు ధనుష్ రాజకీయ అరంగేట్రం వైపే వేళ్లు చూపిస్తున్నప్పటికీ, పార్టీ ఏర్పాటుపై కానీ, ఎన్నికల్లో పోటీ చేయడంపై కానీ ధనుష్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

You may also like
రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌లో యాక్సిడెంట్!
కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇవ్వబోం: అన్నామలై!
దేశంలో అరాచకం సృష్టించే యత్నం: కిషన్ రెడ్డి
kishan reddy slams tg assembly speaker
కాంగ్రెస్‌కు సున్నా సీట్లు.. రాహుల్ పై కిషన్ రెడ్డి సెటైర్లు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions