Tuesday 13th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దేశంలో అరాచకం సృష్టించే యత్నం: కిషన్ రెడ్డి

దేశంలో అరాచకం సృష్టించే యత్నం: కిషన్ రెడ్డి

  • కాంగ్రెస్ తీరుపై కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహం

Kishan Reddy Press Slams Rahul Gandhi కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఢిల్లీలో నిరసనల పేరుతో చేస్తున్న డ్రామాలను ప్రజలు అసహ్యించు కుంటున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో అరాచకం సృష్టించేం దుకు, రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను రాహుల్ గాంధీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

వ్యవస్థలపై దాడి..

దేశ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారని, రాహుల్ గాంధీ తన స్థాయిని మరిచి అధమ స్థాయికి దిగజారి వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అజిత్ దోబల్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌లను టార్గెట్ చేస్తూ మాట్లాడటం బాధ్యతారహితం అన్నారు. తమకు అనుకూలంగా తీర్పులు రాలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను కూడా గద్దెదిಗాలని అనడం, ఎన్నికల కమిషనర్‌ను టార్గెట్ చేయడం కాంగ్రెస్ మానసిక స్థితికి అద్దం పడుతోందని విమర్శించారు.

ಎస్‌ఐఆర్‌ (SIR) పై తప్పుడు ప్రచారం..

దేశంలో ఎస్‌ఐఆర్ ద్వారా చనిపోయిన వారు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన కోట్లాది మంది బోగస్ ఓట్లను తొలగిస్తే రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతున్నారని, తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులే ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ తీరును బంగ్లాదేశ్‌లో హిందువులను ఊచకోత కోస్తున్న ఉన్మాదులు సైతం సమర్థిస్తున్నారని, ఆయనకు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి మద్దతు వస్తోందని ఎద్దేవా చేశారు.

వారం రోజులుగా ఢిల్లీలో నిరసనల పేరుతో మార్కెట్లను జామ్ చేసి, పండుగ సీజన్‌లో చిన్న వ్యాపారాలను, ప్రజల రోజువారీ జీవనాన్ని అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ ధర్నాలకు ఎక్కడా అనుమతి ఇవ్వకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని పొగుడుతూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు.

You may also like
kishan reddy slams tg assembly speaker
కాంగ్రెస్‌కు సున్నా సీట్లు.. రాహుల్ పై కిషన్ రెడ్డి సెటైర్లు!
Rahul Gandhi on Women's Reservation Bill 2026
ఎలోన్ మస్క్ ‘స్టార్‌లింక్’ వివాదంలో దూరి అడ్డంగా బుక్కైన కాంగ్రెస్!
‘సత్యాగ్రహ’ డిజిటల్ వేదికను ప్రారంభించిన రాహుల్ గాంధీ!
కాంగ్రెస్‌కు మోదీని ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈసీపై నిందలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions