Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి

bio asia summit 2026

CM Revanth Speech at Bio Asia Summit 2026 | హైదరాబాద్‌లో జరిగిన బయోఏషియా-2026 సదస్సు వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పారు.

23 ఏళ్ల క్రితం చార్మినార్, బిర్యానీ, సాఫ్ట్‌వేర్ నగరంగా మాత్రమే గుర్తింపు ఉన్న హైదరాబాద్ నేడు “ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని”గా ఎదిగిందని గర్వంగా తెలిపారు. దూరదృష్టి నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్య మానవ వనరులే ఈ విజయానికి కారణమన్నారు.

గత రెండేళ్లలో జీవవిజ్ఞాన రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వెల్లడించారు. దావోస్ వేదికగా ప్రకటించిన కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, జీనోమ్ వ్యాలీ విస్తరణ, ‘వన్-బయో’ ఆవిష్కరణలతో ఫార్మా సిటీ పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు.

“టెక్‌బయో అన్‌లీష్డ్: ఏఐ, ఆటోమేషన్ & ది బయాలజీ రెవల్యూషన్” ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సుకు 500 సంస్థల నుంచి 4,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. World Economic Forum మాదిరిగా బయోఏషియా అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తోందని సీఎం అభిప్రాయపడ్డారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’
KTR press meet
‘ఆరు గ్యారెంటీ ల కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం’
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions