Wednesday 8th July 2026
12:07:03 PM
Home > క్రీడలు > టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్!

టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్!

australia team

Australia Ends T20 Worldcup Tour | భారత్ శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మేటి జట్టు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. టోర్నీ నుంచి గ్రూప్ దశలోనే ఆస్ట్రేలియా జట్టు నిష్క్రమించింది.

సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఓడిన ఆసీస్ సూపర్ 8 ఆశలు గల్లంతయ్యాయి. ఆ జట్టు భవితవ్యం నేటి ఐర్లాండ్ జింబాబ్వే మ్యాచ్ పై ఆధారపడింది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ గెలిస్తే, ఆసీస్ సూపర్ 8 కి వెళ్లేది.

అయితే మంగళవారం కాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్ జింబాబ్వే  మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఆస్ట్రేలియాతో పాటు ఐర్లాండ్ జట్టు కూడా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక ఆస్ట్రేలియా శుక్రవారం ఒమన్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. 

You may also like
పోస్ట్‌మ్యాన్ ఉద్యోగం నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు..

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions