Tuesday 24th November 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రాజీవ్ గాంధీ హత్య వెనుక కుట్ర.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

రాజీవ్ గాంధీ హత్య వెనుక కుట్ర.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

Rahul Gandhi on Women's Reservation Bill 2026

Rahul Gandhi Alleges Rajiv Gandhi Security Removal మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రిని హత్య చేయించాలనే ఉద్దేశంతోనే అప్పట్లో ఆయనకు ఉన్న భద్రతను కావాలనే తొలగించారని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) అనే ఆత్మకథ పుస్తకంపై సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో కలిసి జరిపిన చర్చా వీడియోను మంగళవారం (నవంబర్ 24, 2026) రాహుల్ గాంధీ తన ‘ఎక్స్’ (X) ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా నాటి విషాద ఘటనలను ఆయన గుర్తుచేసుకున్నారు.

ఉద్దేశపూర్వక కుట్ర..

1989 తర్వాత రాజీవ్ గాంధీకి ఉన్న భద్రతను తొలగించడం అనుకోకుండా జరిగిన పొరపాటు కాదని, ఆయన హత్యకు అనుకూల వాతావరణం సృష్టించడానికే ఉద్దేశపూర్వకంగా ఆ పని చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు అప్పట్లో జరుగుతున్న పరిణామాలపై తాను తన తల్లిదండ్రులిద్దరినీ ముందే హెచ్చరించానని రాహుల్ తెలిపారు. భద్రత విషయంలో ఏం జరుగుతోందో వివరిస్తూ తన తండ్రి రాజీవ్ గాంధీతో తాను వాదించినట్లు కూడా ఆయన వెల్లడించారు.

తండ్రి మరణం తర్వాత సోనియా గాంధీలో మార్పు..

1991 మే 21న జరిగిన రాజీవ్ గాంధీ హత్య తర్వాత తమ కుటుంబంలో ఎదురైన మానసిక వేదనను రాహుల్ గాంధీ ఈ చర్చలో పంచుకున్నారు. ఏదో జరగబోతోందనే ముందస్తు ఆందోళన (Premonition) తన తల్లికి ఉండేదని రాహుల్ పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఎప్పుడూ నవ్వుతూ, అందరితో కలుపుగోలుగా ఉండే సోనియా గాంధీ పూర్తిగా మారిపోయారని, తాము ఒక “కొత్త తల్లిని” చూశామని ఆయన భావోద్వేగంగా చెప్పారు.

తమకు తీరని ఆవేదన మిగిలినప్పటికీ, తన తండ్రి హత్యకు కారణమైన వారిపై తమకు ఎలాంటి కోపం గానీ, ద్వేషం గానీ లేదని రాహుల్ గాంధీ గతంలోనూ స్పష్టం చేశారు. మార్చి 2018లో సింగపూర్‌లో జరిగిన కార్యక్రమంలోనూ, 2021 ఫిబ్రవరి 18న పుదుచ్చేరిలో జరిగిన భేటీలోనూ.. తాను, తన సోదరి ప్రియాంక నిందితులను ఎప్పుడో క్షమించేశామని రాహుల్ పేర్కొన్న విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి.

You may also like
ఆ రాష్ట్రం పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
తల్లిని కోల్పోయిన వేళ సీఎం యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగ లేఖ!
ఇటలీ నేత ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ నినాదం.. వీసా నిబంధనల ఉల్లంఘనపై కేంద్రం సీరియస్!
మేకెదాటు డ్యామ్ నిర్మాణంపై కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions