Wednesday 15th April 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఆదర్శ కుటుంబం-AK 47’

‘ఆదర్శ కుటుంబం-AK 47’

Trivikram-Venkatesh’s Film Titled Aadarsha Kutumbam House No. 47 | అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న త్రివిక్రమ్-వెంకటేష్ చిత్రం పట్టాలెక్కింది. బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకు ‘ఆదర్శ కుటుంబం’ అని టైటిల్ ను ఖరారు చేస్తూ మేకర్స్ వెంకటేష్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

అలాగే హౌస్ నంబర్ 47, AK-47 అనే ట్యాగ్ లైన్ తో ఈ మూవీ టైటిల్ ఆసక్తిగా ఉంది. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ , ‘మల్లీశ్వరి’ సినిమాలకు దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని అందించారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో ఒక మూవీ వస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇకపోతే ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇకపోతే అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ మూవీలో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions