Sunday 30th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వీర్ సావర్కర్ అవార్డు..తిరస్కరించిన ఎంపీ

వీర్ సావర్కర్ అవార్డు..తిరస్కరించిన ఎంపీ

Shashi Tharoor denies receiving Veer Savarkar Award | ‘వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ అవార్డు-2025’ కు తనను ఎంపిక చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. హైరేంజ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనే సంస్థ తాజగా శశి థరూర్ కు వీర్ సావర్కర్ అవార్డును ప్రకటించింది. ఢిల్లీలో బుధవారం అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరగాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో మీడియాలో వచ్చిన కథనాలపై శశి థరూర్ స్పందించారు. తనకు ఈ అవార్డు ప్రకటించారనే విషయాన్ని కేవలం మీడియా ద్వారానే తెలుసుకున్నట్లు చెప్పారు. కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో అక్కడి మీడియా ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. అయితే ఈ అవార్డు గురించి, సదరు సంస్థ గురించి తనకు ఏ మాత్రం అవగాహన లేదన్నారు. తాను అవార్డును అంగీకరించడం లేదని కార్యక్రమంలో కూడా పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.

సంస్థ తనను సంప్రదించకుండా అవార్డుకు ఎంపిక చేయడాన్ని బాధ్యతరాహిత్యంగా పేర్కొన్నారు. ఇదే సమయంలో థరూర్ వ్యాఖ్యలపై హెచ్ఆర్డీఎస్ సెక్రటరీ అజి కృష్ణన్ మాత్రం థరూర్ కు ముందుగానే సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మూలంగానే థరూర్ లో మార్పు వచ్చిందన్నారు

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions