Saturday 12th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > అభిషేక్ శర్మ అంటే పాకిస్థానీలకు పిచ్చి..ఎంతలా వెతికారంటే!

అభిషేక్ శర్మ అంటే పాకిస్థానీలకు పిచ్చి..ఎంతలా వెతికారంటే!

Abhishek Sharma tops 2025 Google searches in Pakistan | టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కోసం పాకిస్థానీలు విపరీతంగా వెతికారు. ఎంతలా అంటే తమ దేశ ప్లేయర్ల కంటే ఎక్కువగా అభిషేక్ శర్మ గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరిచారు. 2025లో పాకిస్థాన్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ ఎవరంటే అది అభిషేక్ శర్మనే. బాబర్ అజాం, షాహీన్ షా ఆఫ్రిది వంటి ఆ దేశ స్టార్లను కాదని అభిషేక్ శర్మ టాప్ లో నిలిచారు. దీనికి ప్రధాన కారణం ఆసియా కప్-2025.

ఈ టోర్నీలో భాగంగా పాకిస్థాన్ తో టీం ఇండియా ముచ్చటగా మూడు సార్లు తలపడింది. ఫైనల్ మినహా మిగిలిన రెండు మ్యాచుల్లో అభిషేక్ పాక్ బౌలర్లతో చెడుగుడు ఆడుకున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో పాక్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలోనే మన డాషింగ్ ప్లేయర్ గురించి తెలుసుకునేందుకు పాకిస్థానీలు తెగ ఆసక్తి కనబరిచారు. దింతో 2025 సంవత్సరంలో పాకిస్తాన్‌ ప్రజలు గూగుల్‌లో అత్య‌ధికంగా వెతికిన అథ్లెట్లలో అభిషేక్ శర్మ మొదటి స్థానంలో నిలిచారు. ఇకపోతే ఆ దేశ క్రికెటర్లు హసన్ నవాజ్, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, సాహిబ్జాదా ఫర్హాన్, ముహమ్మద్ అబ్బాస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions