Monday 9th December 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక అవార్డు.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్!

నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక అవార్డు.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్!

Natu Natu Song Wins Golden Globe Award | తెలుగు సినిమా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమా ఇప్పటికే అనేక రికార్డులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  

తాజాగా ఈ సినిమా మరో ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది. సినిమాలోని ‘నాటునాటు’ పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైంది.

అతిరథ మహారథుల మధ్య సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. చంద్రబోస్‌ రాసిన ఈ నాటు నాటు పాటను కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.

ఈ మాస్ సాంగ్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించాయి.

అమెరికాలోని కాలిఫోర్నియాలో  గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు-2023 వేడుక జరుగుతోంది. ఈ సందర్భంగా బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ నాన్‌ ఇంగ్లిష్‌ మూవీ విభాగాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నామినేట్‌ అయింది. ఇందులో బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ అవార్డును సొంతం చేసుకుంది.

ఒక భారతీయ సినిమాకు అందులోనూ తెలుగు సినిమాకు ఈ అవార్డు రావడం ఇదే మొదటిసారి.  ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఆస్కార్‌ బరిలోనూ ఉంది.

భారతీయ సినిమా పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పట్ల దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నయి.

Read Also: నాని విలన్ తో తమన్నా డేటింగ్.. హగ్స్, కిసెస్ తో హంగామా!

ప్రధాని మోదీ ప్రశంసలు..

ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ కు కంగ్రాట్స్ చెబుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు మోదీ.

“ఇది చాలా ప్రత్యేకమైన విజయం! ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ లకు అభినందనలు.

నేను రాజమౌళి, తారక్, రామ్ చరణ్ మరియు ఆర్ఆర్ఆర్ టీం మొత్తాన్ని అభినందిస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసింది” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

అదేవిధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆర్ఆర్ఆర్ టీంకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

సినీ ప్రముఖులు చిరంజీవి, ఏఆర్ రెహమాన్, కే రాఘవేంద్ర రావు, షారుఖ్ ఖాన్ పలువురు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు ఆర్ఆర్ఆర్ టీంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions