Rajinikanth enjoys spiritual break in Rishikesh | సూపర్ స్టార్ రజినీకాంత్ సింప్లీసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో మాత్రమే ఆయన ఆర్భాటంగా కనిపిస్తారు మినహా నిజ జీవితంలో మాత్రం అత్యంత సాదాసీదాగా ఉంటారు. తాజగా హిమాలయ పర్యటనలో ఉన్న రజినీ రోడ్డుపక్కనే సామాన్య వ్యక్తిలా పేపర్ ప్లేటులో భోజనం చేశారు.
దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన రజినీ స్నేహితులతో కలిసి హిమాలయ పర్యటనకు వెళ్లారు. ఆదివారం రిషికేశ్ ను సందర్శించారు. సోమవారం బద్రీనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.









