- అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Allahabad High Court judgment on SC ST Act | ఎస్సీ-ఎస్టీ (SC-ST) అట్రాసిటీ నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా ఉండేలా అలహాబాద్ హైకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది.
అవమానించాలనే లేదా భయపెట్టాలనే దురుద్దేశం లేకుండా ఒక వ్యక్తిని వారి కులం పేరుతో పిలవడం నేరం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
నిందితుడికి బాధితుడిని కులం పేరుతో కించపరచాలనే, అవమానించాలనే లేదా భయపెట్టాలనే స్పష్టమైన దురుద్దేశం ఉన్నప్పుడు మాత్రమే అది ఈ చట్టం కింద నేరంగా పరిగణించబడుతుందని న్యాయస్థానం వివరించింది.
కేవలం ఒక వ్యక్తిని వారి కులం పేరుతో సంబోధించినంత మాత్రాన, ఎస్సీ-ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం సరైనది కాదని కోర్టు తేల్చి చెప్పింది.
కేసు నేపథ్యం ఇదీ..
అమేయ్ పాండే మరియు మరో ముగ్గురిపై 2019లో నమోదైన ఒక క్రిమినల్ అప్పీల్‌ను విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ మదన్ పాల్ సింగ్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ తీర్పు ద్వారా ఎస్సీ-ఎస్టీ చట్టం పరిధిని, దానిని ఎప్పుడు ప్రయోగించాలనే అంశాన్ని న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసినట్లయింది.







