Thursday 24th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడు’

‘సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడు’

‘Hanuman Is Powerful Than Superman and Spiderman’ | హాలీవుడ్ సూపర్ హీరోల గురించి కాకుండా మన పురాణాల్లో ఉండే పురుషోత్తముల గురించి పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నొక్కిచెప్పారు. సూపర్ మాన్, స్పైడర్ మాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడు అని వివరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ మేరకు శుక్రవారం తిరుపతిలో నిర్వహిస్తున్న ‘భారతీయ విజ్ఞాన సమ్మేళనం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియాస్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

బ్యాట్ మాన్, ఐరన్ మాన్ కంటే అర్జునుడు గొప్ప యోధుడు అని వివరించాల్సిన అవసరం ఉందన్నారు. పరమశివుడి మహత్యం గురించి, శ్రీకృష్ణుడి మహిమల గురించి యువతకు చెప్పాలన్నారు. శ్రీరాముడిని మించిన పురుషోత్తముడు లోకంలో లేరని, రామరాజ్యం గురించి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. అవతార్ సినిమా కంటే రామాయణ, మహా భారత గాథలు గొప్పవని యువతకు వివరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా బకాసురుడు, కంసుడు వంటి రాక్షసుల గురించి కూడా చెప్పాలని అప్పుడు మంచీ, చెడుల మధ్య వ్యత్యాసం ఏంటో అర్ధం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions