Saturday 3rd October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘చుట్టమల్లె’ డీప్ ఫేక్ వీడియోలపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం!

‘చుట్టమల్లె’ డీప్ ఫేక్ వీడియోలపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం!

Jr NTR Chuttamalle Deepfake Video Warning నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత దుర్వినియోగం పెరిగిపోతుండటంపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అత్యంత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

‘దేవర’ చిత్రంలోని ప్రసిద్ధ ‘చుట్టమల్లె’ (Chuttamalle) పాటను ఉపయోగించి సృష్టించిన అసహ్యకరమైన, నీచమైన డీప్ ఫేక్ (Deepfake) మార్ఫింగ్ వీడియోలపై ఆయన సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తూ ఏఐని దుర్వినియోగం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

‘మాతృదేవో భవ’ అనే గడ్డపై ఇంత దిగజారుతారా?

“స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే ‘మాతృదేవో భవ’ అనే పదం కేవలం మాట మాత్రమే కాకుండా మన సంస్కృతిలో భాగమైన ఈ గడ్డపై, కొందరు వ్యక్తులు ఒక స్త్రీని అత్యంత నీచమైన రీతిలో అవమానించడానికి ఏఐ (AI)ని ఉపయోగిస్తున్నారు. ఇంతటి నీచమైన దాన్ని సృష్టించడం మాటల్లో చెప్పలేనంత సిగ్గుచేటు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

“మార్ఫింగ్ చేయబడిన ఈ ‘చుట్టమల్లె’ వీడియో వెనుక ఉన్న నీచులారా, మీలో ఎవరినీ నేను వదిలిపెట్టను. దీన్ని సృష్టించిన వారిపైనా, సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వారిపైనా సాధ్యమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాను” అని గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇలాంటి అసహ్యకరమైన, రోత పుట్టించే కంటెంట్‌ను ఎవరూ చూడవద్దని, షేర్ చేయవద్దని కోరారు. “ఈ రోజు మరొకరు కావచ్చు.. రేపు మీ ఇంట్లోని తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె కావచ్చు” అని హెచ్చరించారు.

ప్రభుత్వాలకు విజ్ఞప్తి..

ఏఐ సాంకేతికత దుర్వినియోగానికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు, నిబంధనలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్టీఆర్ ఈ సందర్భంగా కోరారు.

You may also like
pawan kalyan and ntr
ఢిల్లీ హైకోర్టుకు పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్.. కారణం ఏంటంటే!
devara
NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. దేవర అప్ డేట్ టీజర్ ఎప్పుడంటే!
ktr
డీప్ ఫేక్ పై అలర్ట్.. బీఆరెస్ శ్రేణులకు కేటీఆర్ కీలక సూచన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions